Sep 4 2015 @ 03:04AM

ప్రజా ధనంతో విహారమా?: దాసోజు

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకొని చైనాకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజా ధనం దుర్వినియోగం చేసే హక్కు ఎక్కడిదని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు చైనాకు వెళ్తున్న సీఎం.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకొన్నారనీ, ఇది చూస్తే ఆయన రాష్ట్రం కోసం కాకుండా విహార యాత్రలకు వెళ్తున్నట్లుగా భావించాల్సి వస్తోందన్నారు. సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవంటూనే ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శించారు.