Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 03:01AM

నల్లధనవంతులూ.. భయపడకండి: కేంద్రం భరోసా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3: మీరెక్కడ దాచుకున్నా మేం కనుక్కోగలం.. సెప్టెంబర్‌ నెలాఖరులోగా నల్లధనం వివరాలు బయటపెట్టండి.. అంటూ ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్న కేంద్రం నల్లధనవంతులకు మరోసారి భరోసానిచ్చింది. తమ నల్లధన ఖాతాల గురించి ఈ గడువులోపు వెల్లడించిన వారి వివరాలు బయటపెట్టబోమని స్పష్టంచేసింది. ప్రశ్న-జవాబు పద్ధతిలో నల్లధనవంతుల మదిలో మెదిలే 32 సందేహాలకు సమాధానాలతో జూలై 6న ఒక పత్రాన్ని విడుదల చేసిన ఆర్థిక శాఖ.. తాజాగా మరో 27 సందేహాలకు సమాధానమిస్తూ రెండో పత్రాన్ని విడుదల చేసింది. విదేశీ ఆస్తులను లెక్కించే విధానం గురించి అందులో వివరించింది.