Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 02:49AM

విద్యుత్‌ ఉద్యోగులవిభజనపై చర్చించుకోండి: హైకోర్టు

తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు సూచన
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యోగుల కేటాయింపు విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చించుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు హైకోర్టు సూచించింంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం మేరకు కోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలా, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను షిలాబిడే కమిటీకి అప్పగించాలా? తదితర అంశాలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా రెండు రాష్ట్రాల ఏజీలను కోర్టు ఆదేశించింది. చర్చల అనంతరం వచ్చే విచారణలో నిర్ణయం కోర్టుకు తెలపాలని, లేదంటే విచారణ జరిపి తగు ఆదేశాలు జారీచేస్తామని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎ.శంకరనారాయణతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది.