desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 02:09AM

జప్తు చేయని ఆస్తుల్నిఅన్యాక్రాంతం చేయొద్దు:హైకోర్టు

 అగ్రిగోల్డ్‌కు హైకోర్టు ఆదేశం
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం జప్తు చేసినవి కాకుండా ఇతర ఆస్తులపై థర్డ్‌ పార్టీకి అధికారం కల్పించడం, విక్రయించడం, బదలాయించే చర్యలకు పాల్పడవద్దని అగ్రిగోల్డ్‌, అనుబంధ సంస్థల్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు సంస్థ ప్రతినిధి కోర్టుకు హాజరు కావాలని, ఆస్తుల వేలం ప్రక్రియ తమ పర్యవేక్షణలో సాగుతుందని స్పష్టం చేస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బీ భోసాలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.