Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 02:07AM

కొత్త జిల్లాలు 14

  •  ప్రతిపాదనలు సిద్ధం చేయండి
  •  మండలాలు, డివిజన్లకు కూడా..సీసీఎల్‌ఏకు సర్కార్‌ఆదేశం
హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొత్త జిల్లాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గురువారం భూపరిపాలన ముఖ్య కమిషనర్‌(సీసీఎల్‌ఏ)ను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాకు 10 నుంచి 15 లక్షల జనాభా ఉండేలా, జిల్లా కేంద్రానికి అన్ని మండలాలు, డివిజన్లు దగ్గరగా ఉండేలా కసరత్తు చేయాలని నిర్దేశించింది. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు బుధవారం కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం విదితమే. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో కమిటీ వేయడానికి అంగీకరించిన ప్రభుత్వం ఈలోగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీసీఎల్‌ఏ అధర్‌ సిన్హాను ఆదేశించింది. తెలంగాణలో 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం సుముఖత వ్యక్తం చేసింది. కాగా, తెలంగాణలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏకకాలంలో ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ కమిటీ కూడా ఈ ప్రక్రియను ఏకకాలంలో పూర్తి చేయనుంది. తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా, 38 రెవెన్యూ డివిజన్లు, 455 మండలాలున్నాయి. జిల్లాలు రెండింతలు కానుండగా, డివిజన్ల సంఖ్య కూడా బాగానే పెరగనుంది. మండలాలు అదనంగా 50-80 దాకా ఏర్పడతాయని అంచనా.