Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 01:59AM

అక్టోబర్‌ నుంచి మొబైల్‌ పశువైద్య క్లినిక్‌లు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3(ఆంధ్రజ్యోతి): గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2 నుంచి తెలంగాణలోని 36 పశుసంవర్థక డివిజన్లలో సంచార పశువైద్య క్లినిక్‌లను ప్రారంభించనుంది. డివిజన్‌ స్థాయిలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ క్లినిక్‌లను సొంత వాహనాలు కాకుండా.. అద్దె వాహనాల్లో నిర్వహిస్తున్నారు. ఒక్కో వాహనానికి డ్రైవర్‌ వేతనాన్ని కూడా కలిపి రూ.25వేలు చెల్లించనుంది. అంటే రాష్ట్రంలోని 36 పశుసంవర్థక డివిజన్లలో సంచార పశువైద్య క్లినిక్‌లకు వాహనాల కోసం నెలకు రూ.9లక్షల మేర కిరాయి చెల్లించనుంది. ఈ క్లినిక్‌ల ఫోన్‌ నెంబర్లను డివిజన్‌ పరిధిలోని రైతులకు ప్రచారం చేస్తారు. పశువులకు సమస్యలున్న రైతులు ఆ నెంబర్‌కు కాల్‌ చేసినట్లయితే మొబైల్‌ క్లినిక్‌ అక్కడికి వెళ్లిపోతుంది.