Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 8 2015 @ 03:38AM

ప్రాజెక్టులను అడ్డుకోవడం దుర్మార్గం:టి-మంత్రులు

సూర్యాపేటటౌన్‌/ఖమ్మం,ఆగస్టు7: సాగు నీటి ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకోవడందుర్మార్గమైన చర్య అని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు విధానాల వల్ల ఇటు తెలంగాణ ప్రజలే కాక అటు ఆంధ్రా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టులనుప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. గ్రామవ్యవస్థ అభివృద్ధి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, అందుకే ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పదేళ్లుగా గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఖమ్మంలో గ్రామజ్యోతి అవగాహన సదస్సు జరిగింది.
 
సదస్సులోతుమ్మలప్రసంగించారు. చేంజ్‌ ఏజెంట్లు గ్రామాభివృద్ధికి 29 శాఖలను సమన్వయంచేసిపనులు నడిపించాలని కోరారు. పోలీసు యంత్రాంగం స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెరువుల నిర్వహణ పనులు చేపట్టిందటూ వారిని తుమ్మల అభినందించారు. గ్రామజ్యోతి నిర్వహణలో కూడా పోలీసుశాఖ ముందుండాలని, గ్రామాలను దత్తత తీసుకోవాలని ఎస్పీ షానవాజ్‌ ఖాసీంకు మంత్రి సూచించారు.