Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 8 2015 @ 02:06AM

రెవెన్యూ బదిలీలపై తాత్కాలిక నిషేధం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీలపై తాత్కాలిక నిషేధం విధించారు. బదిలీలు నిలిపివేయాలంటూ సీసీఎల్‌ఏ అనిల్‌ చంద్రపునేఠా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఈ నెల 25 వరకు ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన విషయం విదితమే. అయితే రెవెన్యూ శాఖ ఈనెల 10 నుంచి ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి గ్రామసభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బదిలీలలు చేపడితే ఇబ్బందులొస్తాయని పలువురు కలెక్టర్లు సీసీఎల్‌ఏ అనిల్‌ చంద్రపునేఠాకు నివేదించారు. దీంతో ఆయన రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి కేఈ సీఎం కార్యాలయంతో చర్చించి, గ్రామసభలు పూర్తయ్యాక ఆగస్టు 31 తర్వాతే రెవెన్యూ శాఖలో బదిలీలను చేపట్టాలని సీసీఎల్‌ఏకు ఆదేశాలిచ్చారు.