Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 8 2015 @ 01:02AM

అమెరికాకు అసలైన నాయకత్వం ఇస్తా: జిందాల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ‘‘అమెరికా కోరుకుంటున్నది మాటలు కాదు... చేతలు... 2016 నవంబర్‌లో అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకుంటే దేశానికి అలాంటి నాయకత్వాన్ని నేనిస్తా’’ అని లూసియానా గవర్నర్‌ బాబీ జిందాల్‌ (44) ప్రకటించారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీపడుతున్న 17 మంది అధ్యక్ష అభ్యర్థులతో ‘ఫాక్స్‌ న్యూస్‌’ టీవీ చానెల్‌ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన తొలి భారత-అమెరికన్‌ ఆయనే కా గా, రిపబ్లికన్‌ అభ్యర్థులలో 13వ స్థానంలో ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- ‘‘మనకిప్పటికే ఒక గొప్ప వక్త అధ్యక్షుడు (ఒబామా)గా ఉన్నారు. నాతో పోటీపడుతున్న నా రిపబ్లికన్‌ సహచరుల్లోనూ మాటకారులున్నారు. కానీ, ప్రజలకు కావాల్సింది మాటలు చెప్పేవాళ్లు కారు... చేతల మనుషులు కావాలి. అసలైన నాయకత్వం కోసం వాళ్లిప్పుడు ఎదురుచూస్తున్నారు. లూసియానాలో నేను చేసిందదే. అదే తరహాలో దేశానికీ వాస్తవ నాయకత్వం ఇస్తా’’ అన్నారు.