Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 8 2015 @ 00:40AM

ఈ ఏడాదే మారుతి ఎల్‌సివి

తెలుగు రాష్ర్టాల్లో ఎస్‌ క్రాస్‌ విడుదల
 
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ ఈ ఏడాదిలోనే ఒక తేలిక రకం వాణిజ్య వాహనం, ఒక స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం మార్కెట్‌లోకి తీసుకురానుంది. శుక్రవారం హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రీమియం క్రాసోవర్‌ కారు ఎస్‌ క్రాస్‌ను విడుదల చేసిన సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) ఆర్‌.ఎస్‌.కల్సి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కొత్త సెగ్మెంట్లలో ప్రవేశించడం ద్వారా మారుతి కార్ల మార్కెట్‌లో తమ అగ్రస్థానాన్ని కొనసాగించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే త్వరలో ప్రీమియం విభాగంలో మరి కొన్ని కార్లు కూడా మారుతి నుంచి రానున్నాయన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో తాము అమ్మకాల్లో 13 శాతం వృద్ధిని సాధించామని, ఏడాది చివరికి కనీసం 10 శాతం సగటు వృద్ధిని నమోదు చేయాలన్నది తమ లక్ష్యమని కల్సి తెలిపారు. యూరోపియన్‌ మార్కెట్‌ మాంద్యంలో ఉన్న కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక, పశ్చిమాసియా మార్కెట్లలో మరింతగా విస్తరించాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. దేశీయంగా గ్రామీణ మార్కెట్లు, వర్థమాన మార్కెట్లలో అమ్మకాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రీమియం కార్ల అమ్మకం కోసం ఏర్పాటు చేస్తున్న నెక్సా షోరూమ్‌లను దేశంలోని 30 అగ్ర గామి నగరాల్లోనే విస్తరిస్తామని చెప్పారు.
 
హైదరాబాద్‌లో ఎస్‌క్రాస్‌ ధర రూ.9.55 లక్షలు
ఎస్‌క్రాస్‌ను ముందుగానే చెప్పినట్టుగా ఒక ప్రత్యేక సెగ్మెంట్‌ ప్రీమియం క్రాసోవర్‌ విభాగంలో ప్రవేశపెట్టామన్నారు. లో ఎండ్‌ వెర్షన్‌లో కూడా ఎయిర్‌బ్యాగ్‌లు, సెన్సింగ్‌ వైపర్లు, సెన్సింగ్‌ హెడ్‌లైట్లు, ముందువెనుక వరుసలు రెండింటిలోనూ రిక్లెయినింగ్‌ సీట్లు దీని ప్రత్యేకతలని కల్సి చెప్పారు. డీజిల్‌ వెర్షన్‌లోనే అందుబాటులో ఉండే ఎస్‌క్రాస్‌ డిడిఐఎస్‌ 200 వెర్షన్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర హైదరాబాద్‌లో 9,54,912 రూపాయలు కాగా డిడిఐఎస్‌ 320 వెర్షనల్‌లో హై ఎండ్‌ కారు ధర 14,22,086 రూపాయలని ఆయన ప్రకటించారు. డిడిఐఎస్‌ 200 వెర్షన్లు లీటరుకి 23.65 కిలోమీటర్లు, డిడిఐఎస్‌ 320 వెర్షన్లు లీటరుకి 22.7 కిలోమీటర్లు మైలేజి ఇస్తాయని ఆయన చెప్పారు.