Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 15:49PM

హైదరాబాద్: ఏపీలో పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియకు ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, ఆగస్టు 07: ఏపీలో పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు విధివిధానాలను ప్రకటించింది. గ్రామపంచాయితీ లేదా మున్సిపాలిటీ యూనిట్‌గా పాఠశాలలను విభజించింది. కిలోమీటర్‌ పరిధిలో 30మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట పాఠశాలలన్నింటినీ ఏకీకృతం చేశారు. తక్కువమంది విద్యార్థులున్న చోట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఆదర్శ పాఠశాలలో ప్రతి 30మంది విద్యార్థులకు ఓ టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఆదర్శ పాఠశాలలో కనీసం 100మంది విద్యార్థులుండేలా జాగ్రత్తపడనున్నారు.