Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 15:46PM

కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించాలి : డికె అరుణ

న్యూఢిల్లీ, ఆగస్టు 7 : తెలంగాణ కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించకపోవడమంటే బతుకమ్మను అవమానించడమే అని మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. ఇప్పటికైనా కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మంత్రిపదవికి అర్హులైన మహిళలు చాలా మంది ఉన్నారని డికె.అరుణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సహా ఏడు రాష్ర్టాల కేబినెట్‌లలో మహిళలకు స్థానం కల్పించాలన్న అరుణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.