Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 12:43PM

వరుణ్ తేజ్ కు జంటగా నటిస్తున్న ప్రజ్ఞా జైస్వాల్

మన హీరోల్లో చాలామంది లోకల్ ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తే... వరుణ్ తేజ్ మాత్రం నేషనల్ ఫెస్టివల్స్ ను టార్గెట్ చేశాడు. ఇండిపెండెంట్స్ డేకి కంచె ట్రైలర్ వస్తుంటే... గాంధీ జయంతికి సినిమా రాబోతోందట. కమర్షియల్ సినిమాలకంటే.. కాన్సెప్ట్ బేసుడ్ సినిమాలకే ప్రయారిటీ ఇస్తున్నాడు వరుణ్ తేజ్. తొలిచిత్రం ముకుంద ఆశించిన ఫలితాన్ని అందివ్వకున్నప్పటికీ.. నెక్ట్ మూవీ విషయంలోనూ కొత్తదనానికే ప్రాధాన్యతను ఇచ్చాడు ఈ యువహీరో... గమ్యం, వేదం వంటి చిత్రాలతో మెప్పించిన క్రిష్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా కంచె... ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తుండగా వరుణ్ సరసన ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తోంది... సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో... రూపొందుతున్న ఈ సినిమాలో అప్పటి ఇండియన్ సోల్జర్ గా కన్పించబోతున్నాడు వరుణ్... ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. స్వాతంత్ర్యోద్యమకాలం నేపథ్యం కావడంతో.. మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు15న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో లోఫర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న వరుణ్ తేజ్.. అక్టోబర్ లో కంచె సినిమాతో సందడి చేయనున్నాడట. ఆగస్టు-15న ట్రైలర్ ను విడుదల చేస్తున్న కంచె యూనిట్... ఈ సినిమా ఆడియోను సెప్టెంబర్-2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాను అక్టోబర్-2న విడుదల చేయనున్నారట.... సో ఇండిపెండెంట్ డే సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేయడమే కాదు.. జాతిపిత గాంధీజి జయంతి సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారన్న మాట.... దేశభక్తికి సంబంధించిన కథ కావడం వల్లే.. ఈ తేదీలను నిర్ణయించినట్టు తెలుస్తోంది... అయితే చిత్రయూనిట్ మాత్రం దేశాల మధ్యే కాదు మనుషుల మధ్య కూడా కంచె ఉండొచ్చు.. ఇదే తమ సినిమా కథ అంటున్నారు. మరి ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలియాలంటే ట్రైలర్ విడుదలవుతున్న ఆగస్టు-15 వరకూ ఆగాల్సిందే..!