Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 12:40PM

సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి స్టార్ హీరోల ఉత్సాహం

'కిక్ -2' రిలీజ్ కు ముందే... డైరెక్టర్ సురేందర్ రెడ్డి కెరీర్ లో బిగ్ కిక్ వచ్చేసింది! ఒకరు కాదు... ఇద్దరు స్టార్ హీరోలు సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు!'అతనొక్కడే'తో దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి కెరీర్ గ్రాఫ్ లో ఎత్తుపల్లాలకు లోటు లేదు. ఫస్ట్ మూవీతోనే బోలెడంత పేరు తెచ్చుకున్నా ఆపైన అతను చేసిన చిత్రాలు కొన్ని నిరాశ పరిచాయి. మధ్యలో 'కిక్' లాంటి సూపర్ హిట్ మూవీ ఉన్నా... 'రేసుగుర్రం' అతని కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచింది. ఇక తాజా చిత్రం 'కిక్ -2' ఇదే నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కు సురేందర్ రెడ్డి సై అనబోతున్నాడు!మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తి కాగానే... సురేందర్ రెడ్డితోనే సినిమా చేస్తాడన్నది తాజా సమాచారం... అలాగే రామ్ చరణ్ సినిమా పూర్తి కాగానే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తోనూ సురేందర్ రెడ్డి ఓ సినిమా చేయబోతున్నాడట... సురేందర్ రెడ్డి 'కిక్'ను హిందీలో రీమేక్ చేసి చక్కని విజయాన్ని అందుకున్న సల్మాన్... ఇప్పుడు తెలుగులో తెరకెక్కిన 'కిక్ -2' మూవీని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే హిందీలో చేయాలని భావిస్తున్నాడట.... సో సల్లూభాయ్ ప్రోత్సాహంతో వచ్చే యేడాది సురేందర్ రెడ్డి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట... కెరీర్ కు సంబంధించిన విశేషాలు ఇవైతే... సురేందర్ రెడ్డి తండ్రి కాబోతున్నాడనేది మరో విశేషం... ఏదేమైనా కిక్ -2 విడుదలవుతున్న వేళావిశేషం సురేందర్ రెడ్డి కి అన్ని విధాల కలసి వస్తోందన్నమాట... మరి బాలీవుడ్ లో ఈ యంగ్ డైరెక్టర్ ఏ స్థాయిని చేరుకుంటాడో చూద్దాం!!