Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 06:25AM

నేడు ఐఐఎంసీలో కామర్స్‌ టాలెంట్‌ టెస్ట్‌

 ఖైరతాబాద్‌ : విద్యార్థులను వాణిజ్య విద్యాపరంగా ప్రోత్సహించేందుకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌, వాసవి క్లబ్‌లు సంయుక్తంగా కామర్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నాయి. శుక్రవారం సైఫాబాద్‌లోని ఐఐఎంఈ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి ఈ పరీక్ష జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్‌ కూర రఘువీర్‌ తెలిపారు. ఇందులో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు పారితోషికాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తామని తెలిపారు. ఇందులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామర్స్‌ విద్యార్థులందరూ పాల్గొనవచ్చని తెలిపారు. పరీక్షలో పాల్గొన దలచిన విద్యార్థులు టెలిఫోన్‌ భవన్‌ సమీపంలోని కళాశాలలో ఉదయం 9 గంటల వరకు హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు 9493389599, 8143567352 ఫోన్‌నెంబర్లలో సంప్రదించాలన్నారు. :