Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 01:59AM

అరుణ పిటిషన్‌పై నేడు విచారణ

న్యూఢిల్లీ, ఆగస్టు6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రా ల కేబినెట్‌లలో మహిళలకు స్థానం కల్పించకపోవడంపై కాం గ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్‌ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెల్‌.ఎల్‌.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తుంది. తెలంగాణ,యూపీ, పంజాబ్‌, ఢిల్లీ, నాగాలాండ్‌, మిజోరాం, పుదుచ్చేరిల్లో కేబినెట్‌లలో మహిళలకు చోటు కల్పించలేదు. తెలంగాణలో మూడు సార్లు కేబినెట్‌ విస్తరణ జరిగినా మహిళలకు అవకాశం ఇవ్వలేద ని, ఎమ్మెల్యేలను కాని వారిని కూడా కేబినెట్‌లోకి కేసీఆర్‌ తీసుకున్నారని డీకే అరుణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. టీఆర్‌ఎ్‌సలో ఏడుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా వారిని పక్కన పెట్టి వేరే పార్టీలనుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆమె పిటిషన్‌లో తెలిపారు.