Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 00:43AM

అందరం చేనేత దుస్తులు ధరిద్దాం: మంత్రి కొల్లు

విజయవాడ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అందరూ చేనేత వసా్త్రలను ధరించాలని చేనేత, జౌళి మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు చెందిన రూ. 125 కోట్ల రుణాల మాఫీపై సీఎం ఒక ప్రకటన చేస్తారని, రేషన్‌ దుకాణాల ద్వారా కోటి 30 మందికి జనతా వస్త్రాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.