desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 00:09AM

2016 మార్చిలో ‘జైపూర్‌’ జాతికి అంకితం

  •   జైపూర్‌ రెండో యూనిట్‌ లైటప్‌ సక్సెస్‌: సీఎండీ 
జైపూర్‌, ఆగస్టు 6: జైపూర్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను 2016 మార్చిలో జాతికి అంకితం చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్‌ చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో నిర్మిస్తున్న విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండోయూనిట్‌ లైటప్‌ కార్యక్రమం గురువారం విజయవంతమైంది. సీఎండీ సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగానే జైపూర్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుదుత్పత్తితో పాటు సంస్థ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడానికి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా 5 వేల ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.