Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 20:29PM

నీటి అపోహలు!

బతకడానికి నీరు చాలా అవసరం. శరీరంలోని ప్రతీకణం సరిగ్గా పనిచేయాలంటే నీరు తప్పనిసరి. నీరు లేకపోతే మనిషి వారం రోజుల్లో చనిపోతాడు. ఎండ తీవ్రత ఎక్కువుంటే ఇంకా తక్కువ సమయంలోనే ప్రాణాలు పోతాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న నీటిపై కొన్ని అపోహలున్నాయి. ఆ విశేషాలు...
 
రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.
చాలా మంది ఈ మాట వింటుంటారు. కానీ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. ఫిజియలాజికల్లీ చూస్తే పురుషులు 3 లీటర్ల ఫ్లూయిడ్‌, స్త్రీలు 2.2 లీటర్ల ఫ్లూయిడ్‌ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్‌ అంటే ఒక్క నీళ్లు మాత్రమే కాదు. కాఫీ, టీ, ఫ్రూట్‌ జ్యూస్‌, ఇతర బేవరేజ్‌లు ఏవైనా ఫ్లూయిడ్‌ కిందకే వస్తాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే వాటర్‌మెలన్‌, దోసకాయ వంటివి కూడా ఆ జాబితాలోకే వస్తాయి. ఒక వ్యక్తి ఎన్ని నీళ్లు తాగాలనేది అతని ఎత్తు, బరువు, యాక్టివిటీ లెవెల్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఫిజికల్‌ యాక్టివిటీ చేసే వ్యక్తులు డీహైడ్రేషన్‌ బారినపడకుండా ఉండటానికి ఎక్కువ నీళ్లు తాగాలి.
 
ఒకవేళ దాహం వేసిదంటే బాడీ డీహైడ్రేట్‌  అయినట్టే
ఇది కూడా కరెక్ట్‌ కాదు. శరీరంలో ఉండాల్సిన నీటి శాతంలో ఒక శాతం తగ్గినా డీహైడ్రేషన్‌ పరిస్థితి వస్తుంది. కానీ శరీరంలో ఫ్లూయిడ్స్‌ లెవెల్స్‌ తగ్గినప్పుడు దాహం ద్వారా సంకేతాలు పంపుతుంది. దాహం వేయగానే బాడీ డీహైడ్రేట్‌ అయినపోట్లు కాదు.
 
బరువు తగ్గడానికి నీరు ఉపయోగపడుతుంది
నీరులో బరువును తగ్గించే గుణాలు లేవు. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గుతారని అనుకుంటే అది వట్టి భ్రమే. నీరు ఎక్కువగా తాగడం వల్ల తాత్కాలికంగా పొట్ట ఫుల్‌గా ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. నీరు ఆహారంతో కలవకపోవడం వల్ల పొట్టలో అదనంగా ఉన్న నీరు కిడ్నీల ద్వారా బయటకు పోతుంది. అయితే నీరు ఎక్కువగా తాగడం కన్నా వాటర్‌ కంటెంట్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం.
 
నీరు విష పదార్ధాలను తొలగిస్తుంది
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మూత్రవిసర్జన ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది. కానీ దీన్ని శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి కిడ్నీలు ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవడం సరికాదు. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల అవయవాలు బాగా పనిచేస్తాయని ఎక్కడా నిరూపితం కాలేదు. చర్మం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అదే సమయంలో డీహైడ్రేషన్‌ వల్ల చర్మం, కిడ్నీలపై నెగెటివ్‌ ఎఫెక్ట్‌ పడుతుంది. నీళ్లు బాగా తాగితే ఆరోగ్యానికి మంచిది అనుకుంటే తాగండి.
 
క్లియర్‌ యూరిన్‌... హెల్దీ యూరిన్‌
యూరిన్‌ రంగు హైడ్రేటెడ్‌... డీహైడ్రేటెడ్‌ను తెలియజేస్తుంది. హెల్దీ యూరిన్‌ పేల్‌ యెల్లో రంగులో ఉంటుంది. పసుపురంగులో ఉన్న మూత్రంలో సోడియం, నైట్రోజన్‌, పొటాషియం వంటి సాలిడ్‌ పార్టికల్స్‌ ఉంటాయి. అదే సమయంలో మూత్రం క్లియర్‌గా ఉంటే కిడ్నీలు ఎక్కువ ఫ్లూయిడ్‌ను, మినరల్స్‌ను డైల్యూట్‌ చేసి పంపుతున్నాయని అర్థం.
 
ఏ సమయంలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
  •  ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల ఆర్గాన్స్‌ అన్నీ యాక్టివేట్‌ అవుతాయి.
  •  భోజనానికి అరగంట ముందు ఒకగ్లాసు నీరు తాగాలి. ఇది జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడుతుంది.
  •  స్నానానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
  •  రాత్రి పడుకునే ముందు ఒకగ్లాసు నీళ్లు తాగాలి. ఇది స్ట్రోక్‌, హార్ట్‌ఎటాక్‌ను నిరోధిస్తుంది.