desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 11:41AM

బంజారాహిల్స్‌లో రెచ్చిపోతున్న మందుబాబులు

హైదరాబాద్‌, ఆగస్టు 6 : నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 14లో తాగుబోతులు రెచ్చిపోతున్నారు. రాత్రివేళ తప్పతాగిన మందుబాబులు రోడ్డుపై వెళ్తున్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇళ్లకు సమీపంలో మద్యం షాపులు ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని మహిళలు వాపోతున్నారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు.