Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 11:25AM

సొంతపార్టీపైనే శత్రు‘గన్’ గురి!

న్యూఢిల్లీ (ఆగస్ట్ 6): కీలకమైన బీహార్ ఎన్నికల సమయంలో సొంతపార్టీ నేత, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి కొత్త తల నొప్పులు సృష్టిస్తున్నాయి. బీహార్‌కే చెందిన శత్రుఘ్న.. పార్లమెంట్‌లో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు.
 
‘రాజకీయ ప్రత్యర్థులు మనకు శత్రువులు కారు. వారి వ్యాఖ్యలతో విభేదించవచ్చు. కానీ, వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఈ చర్య నాకు చాలా బాధ కలిగించింది. 25 మందిని సస్పెండ్ చేయడం బాధాకరం. అందులో ఓ ఎంపీ ఆ సమయంలో పార్లమెంట్‌లో కూడా లేరు’ అని శత్రుఘ్న ట్వీట్ చేశారు. కాగా, ఈ ట్వీట్లపై బీజేపీ ఆగ్రహంతో ఊగిపోతుంటే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. శత్రుఘ్న.. బీహార్‌కే గర్వకారణమని ప్రశంసించారు. దీనికి ప్రతిగా శత్రుఘ్న కూడా నితీష్ కుమార్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. నితీష్ తనకు మంచి స్నేహితుడని, బీహార్ ప్రజలు అతణ్ని ఎంతో అభిమానిస్తారని పేర్కొన్నారు.