Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 06:54AM

ర్యాగింగ్‌ శిక్ష భయంతో.. బీటెక్‌ విద్యార్థిని బలన్మరణం

గుంటూరు: ర్యాగింగ్‌ ఆరోపణలు రుజువైతే తనపై చర్యలు తీసుకుంటారనే భయంతో ఓ బీటెక్‌ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం చందలూరుకు చెందిన నార్నె సునీత గుంటూరు సమీపంలోని మలినేని ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. కళాశాలలో సెల్‌ వినియోగాన్ని నిషేధించగా, సునీత వద్ద సెల్‌ ఫోన్‌ ఉండడం గమనించి ప్రిన్సిపాల్‌ స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల కిందట సునీత తల్లి అంజమ్మ కళాశాలకు రాగా ఆమెకు ఇచ్చారు. ఇటీవల జూనియర్‌ విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో సునీతతో పాటు ఐదారుగురు వివిధ రకాల ప్రశ్నలతో ర్యాగింగ్‌ చేశారు. వాటిని సునీత స్నేహితురాలి వద్ద తీసుకున్న సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసింది. దీనితో జూనియర్‌ విద్యార్థినులు ఈ నెల 3న కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణకు యాజమాన్యం 20 మందితో కమిటీని నియమించింది. కమిటీ బుధవారం విచారణ నిర ్వహిస్తోంది. సునీతను తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ తీసుకురావాలని సూచించింది. దీంతో భయపడిన సునీత కళాశాల పైకి పరుగులు తీసింది. గమనించిన స్నేహితురాలు ఆమెను పట్టుకునేందుకు వెంటపడింది. పై అంతస్తులో సునీతను పట్టుకునే లోపే రెప్పపాటులో కిందకు దూకేసింది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.