Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 02:07AM

సెల్‌ టవర్లకు కొత్త నిబంధనలు

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఇకపై సెల్‌ టవర్లను ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. టవర్ల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బుధవారం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కాబట్టి సంబంధిత సంస్థలు ఆయా నిబంధనలను పాటించడంతో పాటు.. మరెన్నో ధ్రువీకరణలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. గ్రౌండ్‌ బేస్డ్‌ టవర్‌ (జీబీటీ), రూఫ్‌ టాప్‌ టవర్‌ (ఆర్‌టీటీ), రూఫ్‌ టాప్‌ పోల్స్‌ (ఆర్‌టీపీ), సెల్‌ ఫోన్‌ టవర్‌ (సీపీటీ), యాంటెన్నా, ఫ్యాబ్రికేటెడ్‌ యాంటెన్నా, టెలిఫోన్‌ లైన్లు లేదా ట్రాన్స్‌మిషన్‌ కోసం ఏర్పాటు చేసే టవర్లు సహా టెలికమ్యూనికేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ టవర్‌కు సంబంధించిన వాటికి కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయి. అయితే గృహావసరాలకు ఏర్పాటు చేసుకునే ఏంటెన్నాలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు.
 
  • టవర్‌ ఏర్పాటు చేసుకోవాల్సిన భవనం తాలూకు లొకేషన్‌ ప్లాన్‌ను (1:1000 స్కేలు ప్రాతిపదికన) మూడు ప్రతుల్లో అందించాలి. ఆ భవనానికి వెళ్ళే మార్గాన్నీ పొందుపరచాలి. 
  • ఎలివేషన్‌ ప్లాన్‌, సెక్షన్‌ ప్లాన్‌, స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ సర్టిఫికెట్‌, సొంతదారు పత్రం, లీజ్‌ ఒప్పంద పత్రం అందించాలి.
  • టెలికమ్యూనికేషన్ల శాఖతో చేసుకున్న ఒప్పంద పత్రాల తాలూకు ప్రతిని, లేదా కేంద్రం ఆమోదించిన అధీకృత వ్యవస్థతో ఒప్పందం.
  • టవర్‌ వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా... బాధ్యత వహించేలా ఇండెమ్నిటీ బాండ్‌ను ఇవ్వాలి. నష్టపరిహారాన్ని చెల్లించేందుకూ అంగీకరిస్తూ బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 
  • తెలంగాణ రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక శాఖ, పర్యావరణ, అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి పత్రాలివ్వాలి. 
  • రైల్వే ఆస్తులకు 30 మీటర్ల ఆవల మాత్రమే నిర్మించాలి. విద్యుత్తు స్తంభాలకూ తగిన దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. విమానాశ్రయాల సమీపంలోని నిషేధ స్థలాల్లో అనుమతి లభించదు. 
  • గ్యాస్‌ పైప్‌లైన్లు, వారసత్వ సంపద, చారిత్రక కట్టడాల వద్ద నిర్మాణానికి అనుమతులివ్వరు. ఎవరికి వారు తమ భవనంపై టవర్ల ఏర్పాటుకు ఒప్పుకొన్నా అందరికీ అనుమతి లభించడం తేలిక కాదు.