Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 8 2015 @ 02:00AM

షాహిద్‌కి పెళ్లయింది

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ మంగళవారం ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్నాడు. 34 ఏళ్ల షాహిద్‌ కంటే మీరా 13 ఏళ్ల చిన్నది కావడం గమనార్హం. గుర్గావ్‌లోని షాహిద్‌ స్నేహితునికి చెందిన ఓ ఫామ్‌హౌస్‌లో పంజాబీ సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగిన వారి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత బంధువులు, మిత్రులు కేవలం ముప్పై నుంచి నలభై మంది మాత్రమే హాజరయ్యారు. షాహిద్‌ పెళ్లి దుస్తులను కునాల్‌ రావల్‌, మీరా వెడ్డింగ్‌ డ్రస్‌ను అనామికా ఖన్నా డిజైన్‌ చేశారు. వారి వివాహ రిసెప్షన్‌ ఈ నెల 12న ముంబైలో వైభవంగా చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీనికి బాలీవుడ్‌ అంతా తరలిరానున్నది.