Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 19:25PM

‘ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలు?’

న్యూ ఢిల్లీ, జులై 06: ప్రజాస్వామ్యంలో భాగమై, ప్రజలకు బాధ్యతవహించే రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం కిందకి ఎందుకు రావో చెప్పాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం జాతీయ పార్టీలను మంగళవారం ప్రశ్నించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం.. తమ అభిప్రాయం తెలపాలంటూ ఆరు ముఖ్యమైన జాతీయ పార్టీలకు నోటీసులు జారీచేసింది. నోటీసులు అందుకున్న పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీచేసింది. ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావడంపై తమ నిర్ణయాన్ని చెప్పాలంటూ ధర్మాసనం ఆదేశించింది.
రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం ఎన్జీవో పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనం జాతీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది.