Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 18:02PM

‘రాజ్యాంగ అధినేత కాళ్లు పట్టుకోవడం కాదు..
రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి’

హైదరాబాద్, జులై 07: టీడీపీపై వైసీపీ నేతల ఆరోపణలు సరికాదని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ అక్రమాలకు పాల్పడిదంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన ఆయన తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, బలం ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. అదేవిధంగా గుంటూరులో తమ పార్టీకి తక్కువ బలం ఉన్న కారణంగానే అక్కడ పోటీ చేయాలేదని వివరించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ అధినేత కాళ్లు పట్టుకోవడం కాదు.. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని హితవుచెప్పారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం టీడీపీనేనని సోమిరెడ్డి పేర్కొన్నారు.