Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 16:15PM

పుష్కరాలకు 827 ప్రత్యేక రైళ్లు: దక్షిణమధ్యరైల్వే

హైదరాబాద్, జూలై 7: గోదావరి పుష్కరాలకు 827 రైళ్లను నడపనున్నామని దక్షిణమధ్యరైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కూమార్ తెలిపారు. పుష్కర ఘాట్లకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లకు కూడా హాల్టు సౌకర్యాన్నికల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రధాన రైల్వేస్టేషన్లన్నింటిలోను తాగునీరు, వెయిటింగ్ రూం వంటి సౌకర్యాలనుమెరుగుపరుస్తున్నామన్నారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జీఆర్‌పీ, సీఆర్పీఎఫ్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేశామని ఉమాశంకర్ తెలిపారు,