Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 15:52PM

టి. సర్కార్‌పై రాష్ర్టపతి ఏపీ మంత్రుల ఫిర్యాదు
ఫోన్ ట్యాపింగ్ వివరాలు రాష్ర్టపతికి అందజేత

హైదరాబాద్, జులై 07: హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడడంపై ఏపీ మంత్రులు మంగళవారం రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఆంధ్ర్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో ఏపీ మంత్రులు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఏపీ పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఈ భేటీలో బొజ్జల, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి, రావెల, మంత్రులతో పాటు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. రాష్ర్టపతితో భేటీ అనంతంర మంత్రులు మీడియాతో మాట్లాడుతూ సెక్షన్-8, ఉమ్మడి సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నతీరుపై రాష్ర్టపతికి ఫిర్యాదు చేశామని చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కీలక పాత్ర పోషించారని, సెక్షన్-8పై కేసీఆర్‌కు రాజీవ్ శర్మ ఎందుకు వివరించడం లేదని మంత్రులు ప్రశ్నించారు. గరికపాటి రామ్మోహన్ రావు, సెబాస్టియన్‌ల ఫోన్లను ట్యాప్ చేశారని, దీనికి సంబంధించిన వివరాలను రాష్ర్టపతికి అందజేశామని తెలిపారు. కేసీఆర్ సెక్షన్-8 వద్దనుకుంటే.. పార్లమెంట్‌లో చట్టసవరణ చేయించుకోవాలని సూచించారు. అయితే మా ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనాన్ని సహించబోమంటూ మంత్రులు తేల్చిచెప్పారు. తమ ఫిర్యాదులపై స్పందించిన రాష్ర్టపతి, కేంద్ర కేబినెట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. గవర్నర్ నరసింహన్ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఇరు రాష్ర్టాల సమస్యలను పరిష్కరిస్తామంటే తమకు ఎలాంటి అభ్యంతంర లేదన్నారు.