Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 11:03AM

రెండు కోట్ల బంఫర్ ఆఫర్ ను కాజల్ తిరస్కరించిందా?

టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో కోలీవుడ్ పై దృష్టిపెట్టిన కలువ కళ్ల కాజల్... ఇప్పుడు చెన్నైలోనే ఎక్కువగా ఆఫర్లు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ వంటి స్టార్ హీరో సరసన నటించిన కాజల్... ప్రస్తుతం విశాల్ వంటి హీరో సరసన నటిస్తోంది. ఇక ఎక్కువ రోజులు తన కెరీర్ కొనసాగదని భావిస్తున్న ఈ ముద్దుగుమ్మ... వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోవడం లేదని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే.. రీసెంట్ గా తనకు వచ్చిన ఓ బంపర్ ఆఫర్ ను నిర్మోహమాటంగా తిరస్కరించిందట కాజల్. నటుడు, దర్శకుడు లారెన్స్ సినిమాలో నటించేందుకు కాజల్ నో చెప్పడం ఇందుకు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అమ్మడు చాలా తెలివిగానే వ్యవహరించిందని కొందరు చర్చించుకుంటున్నారు.
కాంచన 2 సినిమాతో మంచి జోరు మీదున్న దర్శకుడు లారెన్స్... తన సోదరుడిని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం కథను కూడా సిద్ధం చేసుకున్న ఆయన.. సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందని భావించాడట. అందుకే తన తమ్ముడి సరసన నటించమని కాజల్ ను రిక్వెస్ట్ చేసిన లారెన్స్... ఈ సినిమాలో నటిస్తే ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని ఆఫర్ చేశాడట. అయితే... కొత్త హీరో సరసన నటిస్తే తన కెరీర్ మొత్తం డేంజర్ లో పడిపోతుందని ఫీలైన కాజల్... ఈ ఆఫర్ ను తిరస్కరించిందట. కెరీర్ విషయంలో కాజల్ కరెక్ట్ గానే వ్యవహరించిందని కొందరు అనుకుంటుంటే...అనవసరంగా రెండు కోట్ల ఆఫర్ ను ఈ ముద్దుగుమ్మ మిస్ చేసుకుందని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారట. మరి.. ఈ అందాల భామ నిర్ణయం సరైందో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.