Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 10:50AM

మహేశ్ కోసం మరోసారి ఆ సింగర్ తో దేవిశ్రీ

చిత్రీకరణ పూర్తి చేసుకున్న శ్రీమంతుడు చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయింది. ఇప్పటికే మహేశ్ బాబు డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేయగా... మరోవైపు దర్శకుడు కొరటాల శివ ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. ఇక త్వరలో దేవిశ్రీ ప్రసాద్ రీ-రికార్డింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. తన సినిమాల్లో పాపులర్ సాంగ్స్ ను.. పాప్ సింగర్స్ తో పాడించే దేవిశ్రీ... శ్రీమంతుడు సినిమా కోసం మరోసారి రఘుదీక్షిత్ తో ఓ పాట పాడించాడట. ఫోక్ అండ్ ఫ్యూజన్ లో ఎంతో పాపులర్ అయిన రఘు దీక్షిత్.. దేవిశ్రీ రీసెంట్ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ ఓ పాట పాడాడు.
శ్రీమంతుడు చిత్రం పేరుకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినప్పటికీ.. ఈ సినిమాలో రాక్ సాంగ్ కు కూడా స్థానం ఉందట. రఘుదీక్షిత్ పాడిన ఈ పాటతో... అన్ని పాటల రికార్డింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ ను ఈ నెల 18న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రాక్ లిస్ట్ ఇదేనంటూ... సోషల్ మీడియాలో ఓ లిస్ట్ ప్రచారంలోకి వచ్చింది. మహేశ్ కు జంటగా శ్రుతిహాసన్ నటిస్తున్న ఈ సినిమాపై... ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో.. శాటిలైట్ రైట్స్ తో పాటు... బిజినెస్ కూడా భారీగా జరుగుతోందని తెలుస్తోంది. మరి కొన్నాళ్లుగా అభిమానులకు ఆశించిన స్థాయి విజయాలు అందించలేకపోయిన మహేశ్.. తన బర్త్ డేకు రెండు రోజుల ముందుగానే అంటే ఆగస్టు 7న వస్తున్న శ్రీమంతుడుతో ఆ లోటు భర్తీ చేస్తాడేమో చూద్దాం...!