Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 01:13AM

కార్పొరేట్‌ శక్తులపెత్తనం వద్దు: జేఏసీ చైర్మన్‌ కోదండరాం

బర్కత్‌పుర/హైదరాబాద్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో కార్పొరేట్‌ శక్తుల ఆధిపత్యం ఉండొద్దని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేట్‌ పెత్తనం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణ సాధన-ఆర్‌ఎంపీ, పీఎంపీల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కోదండరాం మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ఆత్మగౌరవంతో జీవించాలని, కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఏజెంట్లుగా మారొద్దని ఆయన హితవు పలికారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, గ్రామీణ వైద్య వ్యవస్థ లేకపోవడం వల్లే ఆర్‌ఎంపీ, పీఎంపీలు ప్రజలకు వైద్యమందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాల వల్ల సమైక్యాంధ్ర పాలకులు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.