Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 6 2015 @ 15:01PM

ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌, జులై 6 : ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న అనురాధను బదిలీ చేస్తూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా నియమించారు. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్‌ డిజీగా నియమించారు. మరో అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను విజయవాడ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.