Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 6 2015 @ 10:13AM

మొసలిని ముద్దాడితేనే.. ఉద్యోగం!

బీజింగ్ (జూలై 6): వినూత్న రీతిలో నిబంధనలు అమలు చేస్తూ ఉద్యోగులను రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాయి చైనా కంపెనీలు. తమకు చెప్పకుండా గర్భం దాల్చకూడదని ఓ కంపెనీ నిబంధన పెడితే.. మొసలిని ముద్దాడితేనే ఉద్యోగమిస్తామని మరో సంస్థ రూల్ పెట్టింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ఓ కంపెనీ సేల్స్ విమెన్ ఉద్యోగాలకు ఇంటర్వూ నిర్వహించింది. ఈ ఇంటర్వూకు వచ్చే అమ్మాయిలు అందంగా ఉండడమే కాకుండా.. తెలివైన వాళ్లు కూడా ఉండాలని షరతు పెట్టింది. ఈ షరతుకు లోబడి దరఖాస్తు చేసుకుని ఇంటర్వూకి హాజరైన అమ్మాయిలు తొలి రౌండ్ పరీక్ష చూసి దిగ్ర్భాంతికి గురయ్యారు.
ఇంతకీ వారిని దిగ్ర్భాంతికి గురిచేసిన అంశం ఏమిటంటే.. సజీవంగా ఉన్న మొసలి నోటి మీద ముద్దుపెట్టుకువాలని సూచించడం. ఇలాంటి పరీక్ష ఏమిటని ప్రశ్నిస్తే.. అమ్మాయిలు అందంగా, తెలివైన వాళ్లుగా ఉండడమే కాదు.. వారికి విపరీతమైన ధైర్య, సాహసాలు కూడా ఉండాలని, అందుకే ఈ టెస్ట్ అని తెలిపారు. అంతే కాదు ఈ పరీక్షలో పాసైన వారికి అక్కడికక్కడే వెయ్యి రూపాయల నజరానా ఇచ్చి వారిని తర్వాతి స్థాయి ఇంటర్వూకి పంపించారు. మొసలి చర్మం, మాంసంతో తయారు చేసే ఆరోగ్య ఉత్పత్తులను తాము విక్రయిస్తామని, అందుకనే తాము ఇలాంటి పరీక్ష పెట్టామని సదరు కంపెనీ యాజమాన్యం సమర్థించుకుంది.