Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 6 2015 @ 02:56AM

ప్రసాదాల కోసం పోలీసుల వీరంగం

  •  యాదాద్రిలో కౌంటర్‌ ధ్వంసం 
  •  8 ట్రేల లడ్డూలు లూటీ
రాష్ట్రపతి పర్యటనలో భద్రత విధులు నిర్వహించిన పోలీసులే ఆయన వెళ్లగానే వీరంగం సృష్టించారు. కౌంటర్‌ అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా 8 ట్రేల (ఒక ట్రేలో 24లడ్డూలు) అభిషేక లడ్డూలను లూటీ చేశారు. భద్రత విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీసులు.. రాష్ట్రపతి కొండ పై నుంచి తిరిగివెళ్లిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అభిషేక లడ్డూలు విక్రయించే ప్రసాద కౌంటర్‌ వద్దకు ఒక్క సారిగా వచ్చారు. ఒక్కటి రూ.60 చొప్పున విక్రయించే లడ్డూల కోసం ఎగబడ్డారు. అయితే అందులో కొందరే టికెట్‌ తీసుకున్నారు. కానీ మరికొంతమంది టికెట్‌ లేకుం డా లడ్డూల కోసం సిబ్బందిని బెదిరించారు. టికెట్‌ లేకుండా లడ్డూలు ఇవ్వడం కుదరదని సిబ్బంది చెప్పారు. దీంతో వారు కౌంటర్‌ అద్దాలు ధ్వంసం చేసి లడ్డూలను లూటీ చేశారు. దీనిపై ఉద్యోగులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. అంతేకాదు.. పగిలిన కౌంటర్‌ అద్దాలకు ఫ్లెక్సీని ఏర్పాటు చేసి.. లూటీ జరిగిన లడ్డూల సొమ్మును దేవస్థానం సిబ్బందితోనే జమచేయించినట్టుగా తెలిసింది.