Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 6 2015 @ 02:48AM

పుట్టుక నా చేతుల్లో ఉంటే దళితుడిగా పుట్టేవాడిని: తమ్మినేని

 మా హక్కులు మాకిస్తే చాలు: చాడా వెంకటరెడ్డి
 
చిక్కడపల్లి/హైదరాబాద్‌: పుట్టుక తన చేతుల్లో ఉంటే దళితుడిగానే పుట్టేవాడినని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్‌ను పోరాటం ద్వారానే సాధిస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీ సబ్‌ప్లాన్‌ అమలుకు కేంద్ర పార్లమెంట్‌లో చట్టం రావాలని, అందు కోసం పోరాటాలు చే యాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ వల్లిస్తున్న బంగారు తెలంగాణను ప్రస్తావించిన ఆయన ‘‘బంగారం ఆయననే ఉంచుకోమనండి. బీసీల హక్కులను వారికిస్తే చాలు’’ అని అన్నారు.