Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 23:13PM

ఆ పదకొండూ వస్తే.. మీరే కింగ్‌..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనగానే లక్షల్లో జీతం.. హైటెక్‌ జీవితం.. అనుకుంటాం. అయితే ప్రాజెక్టులు, డెడ్‌లైన్లు, బాస్‌ల అరవడాలు, అప్పుడప్పుడూ బెంచ్‌ మీదకు చేరడాలు.. వెరసి వారి ఉద్యోగ జీవితం కత్తి మీద సాములా సాగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడూ మార్కెట్‌లోకి వస్తున్న కొత్త టెక్నాలజీని అందుకోకపోతే.. కెరీర్‌ మందగమనంతో సాగుతూ ఉంటుంది. అయితే మార్కెట్‌ నిపుణులు మాత్రం.. టెకీగా సుస్థిరంగా కాలం వెళ్లదీయాలంటే 11 భాషలు వస్తే చాలంటున్నారు. మాట్లాడే భాషలు కాదండోయ్‌..! ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌. జావా, పీహెచ్‌పీ, పెర్ల్‌, సీ, ఆబ్జెక్టివ్‌-సీ, జావా స్ర్కిప్ట్‌, విజువల్‌ బేసిక్‌, రూబీ, పైథాన్‌, సీఎ్‌సఎస్‌, ఆర్‌.. వీటిల్లో పర్‌ఫెక్ట్‌ అయినవారికి కెరీర్‌లో ఏ సమస్యా రాదని భరోసా ఇస్తున్నారు. కొత్తగా వస్తున్న ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై దృష్టి సారిస్తూనే.. ఈ పదకొండింటినీ ఔపోసన పడితే మీ కెరీర్‌కు తిరుగుండదని చెబుతున్నారు. సాధారణంగా ఒకట్రెండు లాంగ్వేజె్‌సలో పట్టున్నవాళ్లకూ ఇప్పుడొచ్చిన ప్రమాదం ఏం లేకపోయినా.. ఫ్యూచర్‌లో ఎలాంటి టెన్షన్స్‌ రాకుండా ఉండాలంటే ఇవి నేర్చుకోవడం మంచిదని సెలవిస్తున్నారు.