Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 16:30PM

హైదరాబాద్‌ : ఇందిరాపార్క్‌ వద్ద హిజ్రాల ధర్నా

హైదరాబాద్‌, జులై 5 : ట్రాన్స్‌ జెండర్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ట్రాన్స్‌ జెండర్స్‌ డిమాండ్‌ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద తమ హక్కుల కోసం హిజ్రాలు ధర్నా చేశారు. తమకు ఉద్యోగం, ఉపాధి, రక్షణ కావాలని నిరసన తెలిపారు. సమాజంలో తమను సాటి మనుషులుగా గుర్తించాలని హిజ్రాలు డిమాండ్‌ చేశారు. రాసే పత్రికల్లో, పాడే పాటల్లో, మాట్లాడే భాషలో కూడా మార్పు రావాలని, అందరం సమానం అన్నప్పుడు, మరి మాకు సమానంగా బతికే హక్కు లేదా? అని వారు ప్రశ్నించారు. మేం ఏం నేరం చేశామని, సమాజంలో తమను అంటరానివారుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.