Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 13:39PM

పుష్కరాలకి బాపు-రమణల విగ్రహాలు

రాజమండ్రి సిటీ: గోదావరి పుష్కరాలు ప్రారంభంనాటికి రాజమండ్రిలో బాపు-రమణల విగ్రహాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు డాక్టర్‌ విజయ్‌భాస్కర్‌ తెలిపారు. విగ్రహాల ఏర్పా టుకు సంబంధించి వ్యక్తమవుతున్న అనుమానాలపై స్పందించి జిల్లా సమాచారశాఖ శనివారం సంబంధిత వర్గాలను సంప్రదించింది. జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర సాంస్కృతికశాఖ ఈ విగ్రహాల తయారీకి అయ్యేఖర్చు రూ.8లక్షల 40 వేలకు సంబంధించి పరిపాలనామోద ఉత్త ర్వులను ఇప్పటికే జారీ చేశారు. ఈ విగ్రహాల నిర్మాణం వివరాలకై సంప్రదించగా కొత్తపేట కు చెందిన ప్రముఖ శిల్పకళా నిపుణులు కళారత్న డి.రాజకుమార్‌వడయార్‌ 8 అడు గుల రమణ విగ్రహాన్ని, 7.5 అడుగుల బాపు విగ్రహాన్ని తయారు చేశామన్నారు. ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న గోదావరి పుష్కరాలకు ముందుగానే రాజమండ్రి నగరం లో గోదావరినది ఒడ్డున బాపు, రమణల విగ్రహాలను ఏర్పాటుచేసేందుకు రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు.