Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 05:35AM

క్యాడ్బరీలో పురుగులు

కర్నూలు (రూరల్‌), జూలై 4: పేరుమోసిన క్యాడ్‌బరీ కంపెనీ చాక్లెట్‌లో పురుగులుండడం చూసి ఓ వ్యక్తి విస్మయానికి గురయ్యాడు. కర్నూలులోని బాబా అంబేద్కర్‌ నగర్‌కు చెందిన ఎ.చిన్నపురెడ్డి శనివారం ఉదయం కొత్త బస్టాండ్‌ ఎదుట ఉన్న ఓ షాపింగ్‌మాల్‌లో బోర్న్‌విల్లే రైసిన్‌ అండ్‌ నట్‌ చాక్లెట్‌ కొన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత చాక్లెట్‌ తినేందుకు ప్యాకింగ్‌ను తొలగించాడు. వెంటనే ఆ చాక్లెట్‌ లోపలి నుంచి తెల్లని పురుగులు బయటకు రావడంతో విస్మయం చెందాడు. తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో చాక్లెట్‌, దానిపై తిరుగుతున్న పురుగులను చిత్రీకరించి మీడియాకు అందజేశాడు. ఈ ఘటనపై ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు కాల్‌ చేసిగా ఆయన స్పందించలేదని చిన్నపురెడ్డి చెప్పారు. దీనిపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తానని ఆయన అన్నారు.