
కౌంటర్ ఇంటెలిజెన్స్(సీఐసెల్)లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం అదనపు అలవెన్సులు ప్రకటించింది. ఉగ్రవాద కదలికలు కనిపెడుతూ, విద్రోహ ఘటనలు జరగకుండా నిలువరించే పనిలో నిరంతరం నిమగ్నమయ్యే పోలీస్ సిబ్బందికి అదనపు అలవెన్సులు ఇవ్వాలని గతంలోనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... కేసీఆర్ ప్రభుత్వం 50 శాతం అలవెన్స్, బేసిక్, డీఏపై 10 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.