Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 05:24AM

‘వ్యాపమ్‌’ కుంభకోణంలో జర్నలిస్టు బలి

ఝాబువా, జూలై 4: మధ్యప్రదేశ్‌లో ‘వ్యాపమ్‌’ కుంభకోణంలో సమాచారాన్ని సేకరించేందుకు వెళ్లిన హిందీ చానల్‌ ‘ఆజ్‌ తక్‌’ విలేకరి అక్షయ్‌ సింగ్‌ శనివారం అనూహ్యంగా అస్వస్థతకులోనై కొన్ని గంటల్లోనే మరణించారు. మధ్యప్రదేశ్‌  ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు 8 ఏళ్ల క్రితం నిర్వహించిన పరీక్షలో భారీగా అక్రమాలు జరిగాయి. ఈ ‘వ్యాపమ్‌’ కుంభకోణంలో నమ్రతా దమోర్‌ అనే అమ్మాయి పేరు వెలుగులోకి రావడంతో అనుమానాస్పద స్థితిలో ఆమె రైలు పట్టాల సమీపాన శవమై కనిపించింది. దానిపై విలేకరి అక్షయ్‌ ఝాబువా సమీపాన మేఘ్‌నగర్‌ వెళ్లి ఆ యువతి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అక్షయ్‌ నురగలు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు.