Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 05:02AM

400 అడుగుల ఎత్తులో నిలిచిపోయిన జెయింట్‌ వీల్‌

ఓర్లాండో, జూలై 4: నాలుగు వందల అడుగుల ఎత్తులో జెయింట్‌వీల్‌. చూడడానికే ఎంత ఎత్తుంటుంతో అని ఆలోచిస్తునారా? సుమారు 120 మీటర్లు. అంత భారీ జెయింట్‌వీల్‌పై ఎక్కాలని ఎవరికైనా కోరికగా ఉంటుంది కదా! అలా అనుకునే కొంత మంది అందులోకెక్కారు. అంత లోనే ఏమైందో ఏమో ఒక్కసారిగా జెయింట్‌ ల్‌తిరగడం ఆగిపోయింది. మూడు గంటల సేపు అలా నిలిచిపోయింది. ఇటువంటి సంఘటనే అమెరికాలోని ఈస్ట్‌కోస్ట్‌ ప్రాంతంలో జరిగింది. అక్కడ 400 అడుగుల ఎత్తులో జెయింట్‌వీల్‌ ఏర్పాటుచేశారు. అది తిరగడం మొదలైన కొంత సేపటికి సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఆ సమయంలో అందులో 66 మంది ఉన్నారు. అనంతరం ఓర్లాండో ఐ రెస్క్యూ బృంద సభ్యులు సుమారు మూడు గంటల పాటు శ్రమించి అందులో ఉన్న వారిని కాపాడారు.