Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 04:34AM

8న సీఎం సమక్షంలో కారెక్కుతా: డీఎస్

  •  నాతో పాటే పలువురు కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి నేతలు కూడా
  •  ఫొటోలు తొలగిస్తే చరిత్ర మారుతుందా?: డీఎస్‌
నిజామాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఈనెల 8వ తేదీన తాను టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీని వాస్‌ ప్రకటించారు. నిజామాబాద్‌ నగరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని తెలం గాణ భవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతామన్నారు. తనతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు రాష్ట్రస్థాయి నేతలు కూడా చేరుతున్నారని చెప్పారు. తాను పదవులు ఆశించి టీఆర్‌ఎస్‌లో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను సీఎం పదవి మినహా అన్ని పదవులు అనుభవించానని పునరుద్ఘాటించారు. సమైక్య రాష్ట్రానికి రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చానని తెలిపారు. ప్రస్తుతం రోజులు మారాయి, పరిస్థితులు మారాయి, ఏ పదవుల పట్ల ఆసక్తి లేదన్నారు. బంగారు తెలంగాణ సాధించడానికే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానన్నారు. అభివృద్ధిలో సీఎం కేసీఆర్‌కు సహకరిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌లో తనకు అన్ని అవకాశాలు కల్పించిన సోనియాగాంధీని జీవితంలో మరిచిపోలేనని, ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. కొంతమంది చెప్పుడు మాటలవల్లే కాంగ్రెస్‌లో తనకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ బ్లఫర్‌, ఆయన వల్లనే ఇదంతా జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక జరిగే విషయం తనకు తెలుపకుండా నిర్ణయం ఎట్లా తీసుకుంటారని ప్రశ్నించిన ఆయన.. తాను ఆకుల లలితకు వ్యతిరేకం కాదన్నారు. తనకు ముందే చెబితే తన ప్రయత్నం మానుకునే వాడినని తెలిపారు. కాగా, గాంధీభవన్‌లో తనవి, కేశవరావు, బొత్స ఫొటోలు తొలగించడం వల్ల చరిత్ర మారుతుందా అని డీఎస్‌ ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌లో ఏ విధంగా పనిచేశానో ప్రజలందరికీ తెలుసని, చరిత్రను ఎవరూ మార్చలేరన్నారు. ఫోటోలు తీసిన వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు. ముఖ్యంగా ఎంపీ హను మంతరావు వ్యాఖ్యలపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఆయన అన్నారు.