Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 03:35AM

ఏపీలో ఇక మొబైల్‌లో ‘మీ సేవ’

  • యాప్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు
హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మొబైల్‌ ఫోన్‌ ద్వారా కూడా పౌరసేవలు వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. ఇప్పటి వరకూ మీ-సేవ కేంద్రాల వరకూ వెళ్లి క్యూలో నిలబడి నానా తంటాలు పడుతోన్న వినియోగదారులకు పౌరసేవలను సీఎం చంద్రబాబు మరింత సులభతరం చేశారు. మొబైల్‌ ఫోన్ల ద్వారాను విద్యుత్‌, గ్యాస్‌, నీటి బిల్లు చెల్లింపులు, పోలీసు సేవలు, పట్టాదారు పాసు పుస్తకాలు, పన్నుల చెల్లింపులు, విద్య, పాస్‌పోర్ట్‌, రైలు, రోడ్డు ప్రయాణానికి సంబంధించిన టికెట్ల కొనుగోళ్లు తదితర 334 రకాల బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఐటీ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను శనివారం సీఎం ఆవిష్కరించారు. ప్రధాని మోదీ ఆవిష్కరించిన డిజిటల్‌ ఇండియాను ఆదర్శంగా తీసుకున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోనూ ఇదే పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీని కోసం ప్రత్యేకంగా వాట్స్‌పను సిద్ధం చేశారు. వాట్సప్‌ ద్వారా 9100199992 నెంబరుకు మెసేజ్‌ పెడితే తక్షణమే పౌరసేవలు అందుబాటులోకి వస్తాయి. త్వరలో జరగనున్న పుష్కరాలకు సైతం ఇదే తరహాలో పౌరసేవలను అధికారులు అందుబాటులోకి తేనున్నారు. ఇంకా రిసోర్సెస్‌ మ్యాపింగ్‌ మొబైల్‌ యాప్‌, వయోజన విద్యకు సంబంధించిన సేవలను, సమాచారాన్ని మొబైల్‌ యాప్‌ల ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పించారు.