Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 4 2015 @ 12:16PM

రాధికా ఆప్టే కావాలనే వివాదం సృష్టిస్తోందా!?

నందమూరి బాలకృష్ణతో లయన్, లెజెండ్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రాధిక ఆప్టే గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఇంటర్ నెట్ లో రాధిక ఆప్టే అని కొడితే చాలు.. అమ్మడికి సంబంధించిన లీక్డ్ వీడియోస్, బోల్డ్ వీడియోస్ బోలెడన్ని ప్రత్యక్షం అవుతాయి. ఈ వన్ ఇయర్ గ్యాప్ లో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో అమ్మడు బాగా ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే ఇటీవల కాలంలో సన్నీలియోన్ కంటే ఈ సెక్సీ బ్యూటీ కోసం సెర్చ్ చేసే వాళ్ల సంఖ్యే ఎక్కువ అవుతోందట. అదీ రాధికా ఆప్టే రేంజ్. అయితే బాలీవుడ్ లో జోరు పెంచుతున్న ఈ బ్యూటీ.. తెలుగులో సినిమాలు చేస్తున్నంత సేపు సైలంట్ గా ఉండి.. అవి కంప్లీట్ కాగానే యూ టర్న్ తీసుకుంటోంది...
ఇప్పటికే గతంలో తెలుగు సినీ పరిశ్రమపై నెగటివ్ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కిన రాధికా ఆప్టే.. ఇప్పుడదే కామెంట్ ను రిపీట్ చేస్తోంది. తెలుగులో హీరోయిన్లకు గౌరవం ఇవ్వరు. ఆ పద్ధతి నచ్చకే తెలుగు సినిమాలకు కమిట్ అవ్వట్లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపి టాలీవుడ్ జనాలకు మళ్లీ షాక్ ఇచ్చింది. రాధికా రెండోసారి టాలీవుడ్ ను టార్గెట్ చేయడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీడియా అట్రాక్షన్ కోసమే ఈ కామెంట్స్ చేసిందా.. లేక తనకు ఎదురైన అనుభవాలనే షేర్ చేసుకుంటుందా అన్నదానిపై.. ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకుంటున్నారు... ఏది ఎలా ఉన్నా.. ఇప్పటికే రకరకాల కాంట్రవర్సీలతో మీడియాలో మార్మోగి పోతున్న రాధికా ఆప్టే పేరు.. మరో నాలుగు రోజులు హెడ్ లైన్స్ లో నిలవడం ఖాయం. కాదంటారా..?