Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 4 2015 @ 11:01AM

నెలఖరుకల్లా స్పెక్ట్రమ్‌ షేరింగ్‌ మార్గదర్శకాలకు కేబినెట్‌ అనుమతి

న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్‌ ట్రేడింగ్‌, షేరింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు ఈ నెల చివరికల్లా కేబినెట్‌ ఆమోదముద్ర లభించే అవకాశం ఉందని టెలికాం శాఖ సెక్రటరీ రాకేష్‌ గార్జ్‌ తెలిపారు. దీని వల్ల టెలికాం రంగంలో విలీనాలు, కొనుగోళ్లు జరగడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. తమ శాఖ స్థాయిలో మార్గదర్శకాల రూపకల్పన ప్రక్రియ ముగిసిందని, కేబినెట్‌ నోట్‌ను కూడా జారీ చేశామని ఆయన చెప్పారు. ఈ నెల చివరికల్లా ఈ మార్గదర్శకాలకు ఆమోదం లభించవచ్చని చెప్పారు. స్పెక్ట్రమ్‌ షేరింగ్‌ మార్గదర్శకాల వల్ల వినియోగంలోలేని స్పెక్ట్రమ్‌ను ఒక కంపెనీ మరో కంపెనీకి ఇచ్చే అవకాశం ఉంటుంది.