Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 4 2015 @ 03:40AM

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఎర్రబస్సు గొడవ

ఏలూరు/చింతలపూడి, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజనతో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో విద్యార్థులకు ఎర్రబస్సు తిప్పలు తప్పటం లేదు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేటల్లోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. అయితే ఆర్టీసీ విభజన జరిగాక ఈ విద్యార్థులకు కొత్త చిక్కొచ్చింది. సత్తుపల్లి-చింతలపూడి మధ్య ప్రయాణించే బస్సుల్లో విద్యార్థులు ఎక్కడానికి వీలులేదని టీఎస్‌ఆర్టీసీ తేల్చేసింది. రాఘవాపురం దాటాక ఏపీ సరిహద్దు గ్రామాలు వస్తున్నందున.. వారి పాసులు అనుమతించేది లేదంటోంది. దీంతో ఈరూట్లో ప్రయాణించే విద్యార్థులు రోడ్డెక్కారు. 3 రోజులుగా ఆందోళన నిర్వ హిస్తున్నారు. ఇంకోవైపు అశ్వరావుపేట మండలంజీలుగుమిల్లి గ్రామానికి సత్తుపల్లి డిపో బస్సులు వచ్చేవి. అయితే.. ఇప్పుడు ఆ గ్రామ విద్యార్థులను కూడా టీఎస్‌ ఆర్టీసీ ఎక్కించుకోకపోవటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బస్సులు తమ ప్రాంతంలో అవసరం లేదంటూ.. సత్తుపల్లి డిపో బస్సులను వెనక్కు పంపారు.