Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 4 2015 @ 02:02AM

ఇక్కడ నాటుతుంటే.. అక్కడ నరికేస్తున్నారు!

మొయినాబాద్‌, జూలై 3: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి అటవీ సంపదను పెంచాలని ఓ వైపు సీఎం కేసీఆర్‌ చెబుతుంటే.. మరో వైపు కొంత మంది అక్రమార్కులు అదే అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. శుక్రవారం చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్ద మంగళారంలో కొంత మంది కలప వ్యాపారులు అక్రమంగా కలపను తరలించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుట్టుచప్పుడు కాకుండా గ్రామసమీపంలో వేప, తుమ్మ తదితర చెట్లను విచ్చలవిడిగా నరికేశారు. చిలుకూరులో సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమం ఉండటంతో రోడ్లపై పోలీసులు మోహరించారు. విషయాన్ని తెలుసుకున్న కలప వ్యాపారులు తమ లారీలను చెట్ల పొదల్లో రాత్రివరకు దాచి ఉంచారు. పోలీసులు, అధికారులు అక్కడి నుంచి వెళ్లాక లారీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఓ పక్క చెట్ల పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం నిర్వహిస్తుండగా.. మరోవైపు కలప వ్యాపారులు చెట్లను నరికి తరలించడం చర్చనీయాంశమైంది.