Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 4 2015 @ 01:00AM

విజయనగరం జిల్లాలోనే గిరిజన వర్సిటీ : మంత్రి రావెల

విశాఖపట్నం/ విజయనగరం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ (జీసీసీ)వ్యాపారాన్ని రూ. వెయ్యి కోట్లకు పెం చేందుకు ప్రణాళికల ను సిద్ధం చేస్తున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. శుక్రవారం విశాఖ శివారులోని తిమ్మాపురం వద్ద గిరిజన మ్యూజియం, గిరిజన సంస్కృతి-పరిశోధనా కేంద్రం, స్టడీ సర్కిల్‌లకు శంకుస్థాపన; జాతరలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం, మఽధురవాడలో ఇం టిగ్రేటెడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. గిరిజన మ్యూజియాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దతామని మంత్రి వెల్లడించారు. గిరిజన వర్సిటీని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, 10,300 మంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని, కోర్టులో కేసువల్ల కొంత జాప్యం జరుగుతున్నదని తెలిపారు.