Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 3 2015 @ 19:16PM

వెయ్యి కోట్లు ఉన్నా ఒక్క చెట్టు లేకపోతే వేస్ట్‌:కేసీఆర్‌

రంగారెడ్డి, జులై 3 : హరితహారం కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శ్రీకారం చుట్టారు. శుక్రవారం చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అటవి సంపదను మనమే నాశనం చేసుకున్నామని అన్నారు. హరితహారం అంటే తెలంగాణకు ఆకుపచ్చ చెట్ల దండ అని ఆయన అన్నారు. అడవుల సంరక్షణ మన అందరి బాధ్యత అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఏడాదికి 40 కోట్ల మొక్కలు నాటాలని, తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని కేసీఆర్‌ సూచించారు. చెట్ల పెంపకంతోనే వర్షాలు కురుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ విధంగా చేస్తే రెండేళ్ల తర్వాత తెలంగాణలో కరువు కనిపించదని ఆయన అన్నారు. రైతులు అడిగే మొక్కలు ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు. గత ప్రభుత్వాలే మన సంపదను నాశనం చేశాయని కేసీఆర్‌ విమర్శించారు. వికారాబాద్‌లో చెట్లు ఎక్కువగా ఉన్నాయనే అప్పటి నాజాం టీబీ ఆస్పత్రి కట్టించారని ఆయన అన్నారు. ‘వికారాబాద్‌ కా హవా.. లాకో మరీజోంకా దవా’ ఇక్కడి చెట్ల గాలి వలన జబ్బులు త్వరగా నయం అవుతాయనే భావనతోనే నిజాం టీబీ శానిటోరియం కట్టారని కేసీఆర్‌ తెలిపారు. వెయ్యి కోట్లు ఉన్నా ఒక్క చెట్టు లేకపోతే వ్యర్థమని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు కేసీఆర్‌ దంపతులు చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకుకున్నారు.